“ఓజి” కి అనిరుద్ ని అందుకే తప్పించారా.. 

ఇప్పుడు టాలీవుడ్ నుంచి పిచ్చ క్రేజ్ ఉన్న పలు చిత్రాల్లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సెన్సేషనల్ యాక్షన్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. కాగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే క్రేజీ హైప్ ని సెట్ చేసుకోగా ఈ సినిమా అప్డేట్స్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ చిత్రం విషయంలో మంచి హైప్ ని పెంచిన ఎలిమెంట్స్ లో సంగీత దర్శకుడు థమన్ సంగీతం కూడా ఒకటి. అయితే ఇలాంటి భారీ సినిమాకి థమన్ ని బదులు తమిళ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ ని తీసుకోవాల్సింది అని చాలా మంది అభిప్రాయ పడ్డారు.

అయితే ఆ తర్వాత మొదట మేకర్స్ అనిరుద్ నే ట్రై చేశారు కానీ తీరా చూస్తే మళ్ళీ త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ తో థమన్ ఈ చిత్రంలోకి వచ్చాడు అని కన్ఫర్మ్ అయ్యింది. దీనితో పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ని తిట్టుకున్నారు. అయితే అసలు విషయంలోకి వెళితే మేకర్స్ మొదట అనిరుద్ నే సంప్రదించగా తనకి సుమారు 10 కోట్ల ఆఫర్ ని ఇచ్చారు అట.

కానీ ఈ చిత్రం తాను చేయను అని చెప్పలేదు అప్పటికే చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అందుకే లేట్ అవుతుంది అని చెప్పాడట. దీనితో అప్పుడు థమన్ ని తీసుకొని వర్క్ చేయమని త్రివిక్రమ్ సూచించాడు అట. దీనితో అలా అనిరుద్ ఈ చిత్రం నుంచి తప్పుకుంటే థమన్ లైన్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతూ ఉండగా పాన్ ఇండియా స్టార్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.