గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ అయితే ఊహించని లెవెల్లో ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. ఒక పక్క తెలుగు నుంచే చాలా సినిమాలు ఉంటే అవి చాలవు అన్నట్టు తమిళ్ నుంచి కూడా సినిమాలు రిలీజ్ రెడీ అయ్యాయి కానీ థియేటర్స్ కొరత కారణంగా వేరే డేట్ కి మారిన చిత్రాల్లో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ కూడా ఒకటి.
కాగా కెప్టెన్ మిల్లర్ చిత్రం తెలుగు సహా తమిళ్ లో విడుదలైంది కానీ అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు బట్ ధనుష్ కెరీర్ లో మంచి వసూళ్లను అందుకుంది. కాగా ఇప్పుడు అయితే ఈ సినిమా ఓటిటి విడుదలకి సిద్ధం అయ్యిపోయింది. ఈ చిత్రం కూడా నెల రోజుల్లోనే ఓటిటిలో రాబోతుంది.
ఈ సినిమాని ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమ్ కానున్నట్టుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ చిత్రం హిందీ మినహా మిగతా సౌత్ భాషల్లో ఈ ఫిబ్రవరి 3 నుంచి రానుంది. మరి ఈ చిత్రంలో కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ యంగ్ హీరో సందీప్ కిషన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.
అలాగే జీవీ ప్రకాష్ సంగీతం అందించాడు. ఇంట్రెస్టింగ్ గా ఈ సంక్రాంతికి వచ్చిన ఆల్ మోస్ట్ అన్ని చిత్రాలు ఆల్ మోస్ట్ నెల రోజుల్లోనే ఓటిటిలో వచ్చేస్తున్నాయి.
#CaptainMiller will be streaming on Prime Video from February 09. pic.twitter.com/IrT3pYNobh
— Suresh PRO (@SureshPRO_) February 2, 2024