ప్రతివారం అన్ని భాషలలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటాయి. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టడానికి ప్రేక్షకుల ప్రశంసలు పొందడానికి ఎదురుచూస్తూ ఉంటాయి. అయితే ఇలా రిలీజ్ అయ్యే సినిమాల్లో కమర్షియల్ సక్సెస్ అయి నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చేవి కొన్ని ఉంటాయి. ఒక్కోసారి చిన్న సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు చేస్తాయి.
ఒక్కోసారి భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలు బ్లాక్ బాస్టర్ జాబితాలోకి వెళ్తాయి. థియేటర్స్ లోకి రావాలంటే ముందు సెన్సార్ పూర్తి చేసుకోవాల్సిందే. ఇక సెన్సార్ సినిమాలు చూసి అందులో ఇబ్బందికర సన్నివేశాలు ఉంటే కట్స్ వేస్తారు. అలాగే సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేస్తారు. సినిమా ఆరంభంలో ప్రతి మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ కనిపిస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే ఈ వారంలో సెన్సార్ జరుపుకున్న సినిమాలు రిపోర్ట్ చూసుకుంటే నాని దసరా సినిమా యు/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమా నీడివి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు. పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా ఐదు భాషలలో దసరా రిలీజ్ అవుతుంది.
తమిళంలో వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుతలై 1 మూవీకి ఏ సర్టిఫకెట్ రాగా, సినిమా నిడివి 2:30 గంటలుగా ఉంది. తమిళంలో శింబు హీరోగా పాతు తాలై సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా నిడివి 2:32 గంటలు. కన్నడంలో ధనుంజయ్ హీరోగా గురుదేవ్ హొయసాల మూవీ రిలీజవుతోంది. దీనికి యు/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. 2:12 గంటల సినిమా నిడివి ఉంటుంది.
హిందీలో అజయ్ దేవగన్ భోళా మూవీ రిలీజ్ అవుతుంది. యు/ఏ సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. 2 గంటల 25 నిమిషాల నిడివి మూవీ ఉండనుంది. తెలుగులో చిన్న సినిమాగా పరారి రాబోతుంది. యు/ఏ సెన్సార్ సర్టిఫికెట్ తో 2 గంటల 19 నిమిషాల నిడివితో ఉంది. అలాగే తెలుగులో దహనం అనే కూడా రిలీజ్ అవుతుంది. దీనికి యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా 2 గంటల 17 నిమిషాల నిడివితో మూవీ రాబోతుంది.
ఏజెంట్ నరసింహ అనే తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది దీనికి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంటల 24 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక డెంగ్యూన్స్ అండ్ డ్రాగన్స్ అనే మూవీ ఇంగ్లీష్, తమిళ్, తెలుగు భాషలలో రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి యు/ఏ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వగా, 2 గంటల 15 నిమిషాల నిడివిలో మూవీ ఉండబోతుంది. ఇక నితిన్, నిత్యా మీనన్ హిట్ మూవీ ఇష్క్ రీరిలీజ్ అవుతుంది. ఈ సినిమా యు/ఏ సర్టిఫికేట్ తో వస్తుంది. 2 గంటల 30 నిమిషాల నిడివి గల చిత్రంగా రాబోతుంది.