పంచ్ లతో పిచ్చెక్కించేలా రెడీ అయినా ఈ వారం కాష్ ప్రోమో ?

సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించే క్యాష్ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఎన్నో అదిరిపోయే టాస్కులతో ఫన్నీ స్కిట్స్ తో ఈ షో మొత్తం ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. ఇక క్యాష్ షో వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులందరు టీవీలకు అతుక్కుపోయి మరి షో చూస్తూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సుమ తన యాంకరింగ్ లో స్పాంటేనియస్ పంచులతో అందరిని మరింత నవ్విస్తూ ఉంటుంది.

 

ఇక ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే క్యాష్ షో ఈ వారం కూడా మరోసారి బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందించి కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమైంది. క్యాష్ లో ఈ వారం వచ్చే వారికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదల చేశారు నిర్వాహకులు. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే వచ్చేవారం మాత్రం ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందుతోంది అని ప్రస్తుతం ప్రేక్షకులు భావిస్తున్నారు. సాధారణంగా క్యాష్ షో లో ప్రతీ వారం నలుగురు కొత్త గెస్ట్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ వారం కూడా క్యాష్ ప్రోగ్రామ్ కి నలుగురు కొత్త గెస్ట్ లు ఎంట్రీ ఇచ్చారు. అంతా తమదైన కామెడీ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించి క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ క్యాష్ షో కి గెస్ట్ గా వచ్చారు. వైవా హర్ష, సుదర్శన్, రంగస్థలం మహేష్, జోష్ రవి క్యాష్ షో కి గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ షోలో ప్రోమో మొత్తం అద్భుతమైన పంచులతో నిండిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఈ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles