అల్లు అర్జున్‌తో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తే.?

‘పుష్ప’ మొదటి పార్ట్‌లో సమంత స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం కూడా ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేయాల్సిందే.

అయితే, మొదటి పార్ట్‌లో అంత క్రేజ్ దక్కించుకున్న ఆ స్పెషల్ సాంగ్‌కి ఎంత మాత్రమూ తగ్గకుండా ఈ పార్ట్‌లో స్పెషల్ సాంగ్ వుండి తీరాలి.

స్టార్ హీరోయిన్‌తో ఆ స్పెషల్ సాంగ్ చేయిస్తేనే ఆ రేంజ్ కిక్కు వస్తుంది. ఆ కిక్కు తేవాలంటే, ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ శ్రీలీల వైపే అందరి వేళ్లూ సులువుగా కదులుతున్నాయ్.

అయితే, ఈ టైమ్‌లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తే ఎలా వుంటుందా.? అని ఆలోచిస్తోందట. అయితే, శ్రీలీలని ఎలాగైనా ఒప్పించే ప్రయత్నంలో ‘పుష్ప 2’ టీమ్ వున్నారనీ తెలుస్తోంది.

రీసెంట్‌గా ఆహా ఛానెల్ ప్రమోషన్ కోసం అల్లు అర్జున్, శ్రీలీల కలిసి ఓ వీడియోలో నటించిన సంగతి తెలిసిందే.