ఇన్సైడ్ టాక్ : “వీర సింహా రెడ్డి” సెట్స్ లో ఏడ్చేసిన ఈ స్టార్ నటుడు.?

టాలీవుడ్ సీనియర్ మాస్ హీరో నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనితో “వీరసింహా రెడ్డి” అనే సినిమాకి వర్క్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం షూటింగ్ కూడా భారీ తారాగణంతో ఇతర భాషల నుంచి తెరకెక్కుతుంది.

అయితే ఇప్పుడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం పై ఓ ఊహించని న్యూస్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా కన్నడ నుంచి స్టార్ నటుడు దునియా విజయ్ ని తీసుకున్న సంగతి తెలిసిందే.

మరి ఈ నటుడు ఈ సినిమా సెట్స్ లో ఎంతో భావోద్వేగానికి లోనయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో తాను లాస్ట్ వర్కింగ్ డే చేయగా ఆరోజు ఎంతో ఉద్వేగానికి లోనయ్యి ఏడ్చేశాడట. అదే చిత్ర యూనిట్ తో లాస్ట్ రోజు కావడం మూలాన బాలయ్య విషయంలో కూడా ఎమోషనల్ అయ్యినట్టుగా కూడా తెలుస్తుంది.

మరి బాలయ్య తనకి దేవుడు ఇచ్చిన అన్నయ్య లాంటి వారు అని ఈ సినిమాతో ప్రయాణం మర్చిపోలేనిది అని తాను అన్నట్టుగా నందమూరి వర్గాలు నుంచి సమాచారం. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తుండగా తమన్ ఎస్ సంగీతం ఇస్తున్నాడు. అలాగే మైత్రి మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.