గాసిప్ : నాని ‘దసరా’ లో ఆ ఒక్క సీన్ అదిరిపోయిందట.!

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోతున్న కాస్త మొదటి నోటెడ్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “దసరా” అని చెప్పుకోవాలి. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా అంతే రీతిలో ఈ సినిమా ని సాలిడ్ హంగులతో అయితే కొత్త దర్శకుడ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు.

కాగా ఈ సినిమాని పక్కా ఒక నాటు కమర్షియల్ సినిమాగా తెరకెక్కించగా అభిమానుల్లో మరింత ఆసక్తి ఈ సినిమాపై నెలకొంది. అయితే ఈ తరహా పాన్ ఇండియా సినిమాలు ఆడియెన్స్ ని కట్టి పడేయాలి అంటే ఎలా లేదన్నా తప్పకుండా మంచి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ లు తప్పనిసరి.

అలా ఇపుడు దసరా లోనే ఓ మైండ్ బ్లాకింగ్ సీక్వెన్స్ ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో మేకర్స్ ట్రైన్ ట్రాక్ సీక్వెన్స్ అని ఒకటి తెరకెక్కించారట. ఇది సినిమాలో ఓ క్రేజీయెస్ట్ సీక్వెన్స్ గా రాగ సినిమా చూసాక ప్రతి ఒక్కరూ ఈ సీన్ కోసం మాట్లాడుకుంటారని సినీ వర్గాల వారు అంటున్నారు.

దీనితో ఈ గాసిప్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా కబాలి, కాలా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు అలాగే ఈ సినిమా వరల్డ్ వైడ్ అయితే మార్చ్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.