“లియో”లో ఈ ఒక్క పార్ట్ మిస్ అవ్వకూడదు అంట..!

చాలా రోజులు తర్వాత ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది అని చెప్పాలి అదే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజు ల కాంబినేషన్ లో తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “లియో”. అయితే ఈ చిత్రాన్ని లోకేష్ తన గత చిత్రాలు ఖైదీ మరియు విక్రమ్ లకి లింక్ ఉందా అనే కోణంలోనే హైప్ ఓ రేంజ్ లో నెలకొంది.

దీనితో పాటుగా లోకేష్ కూడా ఉందని చెప్పడం లేదు దీనితో ఒక రకమైన సస్పెన్స్ ఈ చిత్రంపై నిలవగా తానే ఈ చిత్రంపై ఓ ఎగ్జైటింగ్ అప్డేట్ ని అందించడం అయితే వైరల్ గా మారింది. తాను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఈ సినిమా మొదటి 10 నిముషాలు మాత్రం ఎవరూ మిస్ అవ్వకండి అని ఖచ్చితంగా చెప్తున్నాడు.

ప్రతి ఒక్కరూ కూడా సర్ప్రైజ్ అవుతారు అని ఈ చిత్రం స్టార్టింగ్ 10 నిమిషాలపై మాత్రం గట్టి అంచనాలు రేకెత్తించాడు. మరి ఈ మొదటి 10 నిముషాలు అయితే ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా ఈ చిత్రం గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో ఈ అక్టోబర్ 19న విడుదల కాబోతుండగా త్రిష హీరోయిన్ గా నటించింది.

అలాగే విజయ్ ద్విపాత్రాభినయం చేయగా సంగీత దర్శకుడు అనిరుద్ ఆల్రెడీ సెన్సేషనల్ ఆల్బమ్ ని అందించాడు. అలాగే తమిళ్ సినిమా నుంచి ఇప్పుడు మోస్ట్ హైప్డ్ సినిమాగా రాబోతుంది.