Mahesh Babu : ఇన్సైడ్ టాక్ : మహేష్ సరసన ఈ వన్ ఫిల్మ్ యంగ్ బ్యూటీ.?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురాం పెట్ల తో “సర్కారు వారి పాట” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లో మళ్లీ మంచి మోస్ట్ స్టైలిష్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు హీరోగా మరిన్ని అదిరే సినిమాలు సెట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

మొదటగా తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ సినిమా సెట్ చేయ్యగా అది మొన్ననే ముహూర్తం స్టార్ట్ చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపైనే కొన్నాళ్ల నుంచి ఇంట్రెస్టింగ్ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మాములుగా త్రివిక్రమ్ సినిమాలు అంటే ఇద్దరేసి హీరోయిన్ లు కన్ఫర్మ్ అని తెలిసిందే.

అలాగే ఈసారి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే ఫిక్స్ కాగా ఇప్పుడు రెండో హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనే దానికి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఇది వరకు చాలా మంది స్టార్ హీరోయిన్ లు పేర్లు వినిపించినా ఇప్పుడు మాత్రం కేవలం ఒక్క సినిమా నటించిన యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు ఈ ఏడాది “పెళ్లి సందD” సినిమాలో నటించి మెప్పించిన హీరోయిన్ శ్రీ లీల.

ఈమెనే ఇప్పుడు ఈ భారీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించనుంది అని ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్. మరి ఇదే కానీ నిజం అయితే ఈ యంగ్ బ్యూటీ కి అదృష్టం అంతా ఇంతా కాదు అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. అలాగే ఈ సినిమాకి కూడా థమన్ సంగీతం అందివ్వనుండగా హారిక హాసిని వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించనున్నారు.