నితిన్ ముందున్న టార్గెట్ ఎంతంటే..?

టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోస్ నుంచి మంచి సినిమాలు వచ్చి చాలా కాలమే అయ్యింది అని చెప్పాలి. ఈ ఏడాది మార్చ్ లో యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన “దసరా” మిడ్ రేంజ్ హీరోస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ తర్వాత అరకొర సినిమాలే వచ్చాయి.

మరి ఇపుడు అయితే తనతో పాటుగా నటుడు నితిన్ నుంచి కూడా డిసెంబర్ రిలీజ్ కి రాబోతున్న సినిమా కూడా ఉంది.  కాగా ఆ చిత్రమే ” ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్”. మరి ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేయగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

కాగా ఈ చిత్రం డిసెంబర్ లాస్ట్ లో రిలీజ్ కావాల్సి ఉంది కానీ సలార్ ఎఫెక్ట్ తో ఈ డిసెంబర్ 8కి షిఫ్ట్ అయ్యింది. ఇక ఇపుడు రిలీజ్ దగ్గరకి వచ్చేయగా ఈ సినిమా పట్ల నితిన్ మంచి అంచనాలే పెట్టుకున్నాడు. తన గత చిత్రం మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ కావడంతో తనకి సెట్ అయ్యిన ఎంటర్టైనింగ్ బ్యాక్ డ్రాప్ లోనే వస్తున్నాడు. దీనితో ఈ సినిమాకి థియేట్రికల్ గా మంచి బిజినెస్ నే జరిగినట్టుగా సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది.

దీంతో ఈ చిత్రానికి సుమారుగా 25 కోట్ల మేర బిజినెస్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఇది నితిన్ కెరీర్ లో మరో మంచి నెంబర్ అని చెప్పాలి. మరి ఈ మొత్తం టార్గెట్ ని ఈ సినిమా రీచ్ అవుతుతోందా లేదా అనేది అసలు ప్రశ్న. మరి అది తెలియాలి అంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే. ఫైనల్ గా ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జై రాజ్ సంగీతం అందించడం విశేషం.