ఇండస్ట్రీ టాక్ : రామ్ చరణ్ సినిమాలో శివరాజ్ కుమార్ పాత్ర అదే.. 

రీసెంట్ గా సౌత్ ఇండియా నుంచి రీస్టార్ట్ అయ్యిన మల్టీ స్టారర్ చిత్రాల పర్వం ఇప్పుడు మరింత ఊపందుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాదిలోనే బాలీవుడ్ నుంచి పలు చిత్రాలు కూడా వచ్చాయి. అలాగే తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం “జైలర్” లో కూడా సౌత్ నుంచి పలువురు బిగ్ స్టార్స్ కూడా కనిపించారు.

కాగా దీనితో మల్టీ స్టారర్ చిత్రాలు పట్ల మరింత ఆసక్తి నెలకొనగా ఇప్పుడు ఈ జైలర్ సినిమాలో నటించిన ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ అయితే టాలీవుడ్ లో సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. కాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంకి ఇప్పుడు అంతా పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతుండగా ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ కూడా కన్ఫర్మ్ కావడంతో మాస్ ఆడియెన్స్ కి మంచి ఫీస్ట్ అని ఖాయం అయ్యిపోయింది. కాగా ఇప్పుడు శివ రాజ్ కుమార్ పాత్ర విషయంలో ఆసక్తికర అంశాలు ఇప్ప్పుడు వినిపిస్తున్నాయి.

దీనికి ప్రకారం శివరాజ్ కుమార్ రామ్ చరణ్ కి పెద్దన్నయ్యగా సినిమాలో చాలా పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నాడని మెయిన్ గా తన రోల్ చాలా మాస్ గా ఉంటుంది అని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం శివ రాజ్ కుమార్ దాదాపు 50 రోజులు కాల్షీట్స్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం. అలాగే ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇస్తుండడంతో మరింత గ్రాండియర్ ఈ సినిమాకి చేరుకుంది.