ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రాం హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే మంచి పర్ఫార్మర్ అనిపించుకున్న కాజల్ ఆ తర్వాత క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాతో అందరి దృష్ఠిని ఆకర్షించింది. ఇక 2009 లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా సెటిలైపోయింది.
ఆ తర్వాత ఇక కాజల్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకానొక సందర్భంలో కాజల్ నంబర్ 1 ప్లేస్ కి కూడా చేరుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న కాజల్ కి ఇప్పటికీ సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ ఉంది. కాజల్ లక్కీ హీరోయిన్ మాత్రమే కాదు యంగ్ హీరోల తో పాటు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి సీనియర్ హీరోలకి బెస్ట్ ఛాయిస్ గా మారింది.
అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే కాజల్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లు ని ఈ నెల 30 న పెళ్ళి చేసుకోబోతున్నట్టు అధికారకంగా వెల్లడించి. ముంబైలోని స్టార్ హోటల్ లో ఇరు కుటుంబాలు..అత్యంత సన్నిహితుల మధ్య కాజల్ పెళ్ళి చేసుకోబోతుంది. వాస్తవంగా కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ పెళ్ళి అయి చాలా ఏళ్ళు అవుతోంది. అయితే చెల్లి పెళ్ళి అవగానే కాజల్ కూడా పెళ్ళి చేసుకుంటుందని అందరూ భావించారు. కాని కాజల్ వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఇంతకాలం పెళ్ళి గురించి ఆలోచించలేదు.
అయితే ఇలా కాజల్ పెళ్ళి గురుంచి అఫీషియల్ గా అనౌన్స్ చేసిందో లేదో అలా తను నటిస్తున్న సినిమాల గురించి హాట్ టాపిక్ మొదలైంది. ప్రస్తుతం కాజల్ చేతిలో పాన్ ఇండియన్ సినిమాలున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమా చేస్తుంది. అలాగే మోసగాళ్ళు అన్న పాన్ ఇండియన్ సినిమా, కమల్ హాసన్ తో ఇండియన్ 2, బాలీవుడ్ లో ముంబై సాగా లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుండగా పెళ్ళి తర్వాత ఈ సినిమాలన్ని కంప్లీట్ చేస్తుందా అని చర్చించుకుంటున్నారట. ఇప్పుడు అందరు హ్యాపీగా ఫీలవ్వాల్సింది కాజల్ పెళ్ళి విషయం గాని, కమిటయిన సినిమాల గురించి ఎందుకు అన్న ఫ్యాన్స్ కామెంట్ పడుతున్నాయట. అయితే కాజల్ మాత్రం పెళ్ళి తర్వాత సినిమాలు కంటిన్యూ చేస్తుందని సమాచారం.