ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా దగ్గర కాకుండా సౌత్ ఇండియా సినిమా దగ్గర క్రేజీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “లియో” కూడా ఒకటి. అయితే తమిళ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు సౌత్ అన్ని భాషల్లో నెలకొన్నాయి.
అయితే ఈ చిత్రం ఇప్పుడు ఆల్రెడీ టోటల్ షూటింగ్ అంతా కూడా కంప్లీట్ కాగా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే మేకర్స్ స్టార్ట్ చేశారు. వీటిని కంప్లీట్ చేసి దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తుండగా మరోపక్క అయితే సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా జరుగుతుంది.
అలా తెలుగు నుంచి అయితే ఈ భారీ సినిమా హక్కులు నిర్మాణ సంస్థ సితార ఎంటెర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా నిన్న భారీ అనౌన్సమెంట్ కూడా ఇచ్చారు. అయితే లేటెస్ట్ గా సినీ వర్గాలు అయితే ఈ సినిమా రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఎంతకి కొన్నారో చెప్తున్నారు అయితే ఈ సినిమాకి వారు సుమారు 19 కోట్ల మొత్తం పెట్టి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది.
దీనితో విజయ్ మార్కెట్ అయితే తెలుగులో మరింత పెరిగింది అని చెప్పాలి. లాస్ట్ టైం వారసుడు చిత్రానికి అయితే 13 నుంచి 15 కోట్లు తెలుగు స్టేట్స్ నుంచి వసూలు అయ్యాయి. లియో కి ఎలాగో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈ మొత్తం డీల్ డీసెంట్ నెంబర్ తో క్లోజ్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక వసూళ్లు ఎలా ఉంటాయి అనేది తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.