మళ్ళీ హీరోయిన్ గా ట్రై చేస్తోన్న హాట్ బ్యూటీ .. క్లిక్ అయితే అబ్బాయిలకి పండగే.

టాలీవుడ్ లో హీరోయిన్స్ సక్సస్ అవడం అన్నది మిరాకిల్ అని చెప్పాలి. ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కో హీరోయిన్ ఒకటి రెండు సినిమాలకే తట్టా బుట్టా సర్దేసి ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతారు. కొందరు మాత్రం ఎలాగోలా నెట్టుకొస్తారు. ఇక టాలెంట్ తో పాటు అందం అభినయం ఉన్న పూజా హెగ్డే .. రష్మిక మందన్న.. కీర్తి సురేష్.. సాయి పల్లవి లాంటి వాళ్ళైతే సినిమా సినిమాకి తమ రేంజ్ పెంచుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా మారిపోయి అన్ని భాషల్లో నటించే అవకాశాలను అందుకుంటారు.

 

ఇక ప్రియమణి లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ పెళ్ళి తర్వాత కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటారు. ఇక మరికొంతమందికి సినిమాలు లేక ఫేడవుట్ అయిన కూడా మళ్ళీ లక్కీగా సినిమా ఛాన్స్ అందుకొని మరోసారి లక్ చెక్ చేసుకుంటారు. అలాంటి లిస్ట్ లో ఉంది ఎస్తేర్. టాలెంటెడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన వెయ్యి అబద్ధాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్…ఈ సినిమా తరువాత సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమా చేసింది. ఈ సినిమా తో ఒక మోస్తారు హిట్ అందుకుంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించింది ఎస్తర్.

 

 

అయితే హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ లో సెటిలవలేకపోయింది. హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి ఫేయిల్ అయింది. ఆఖరికి ఇండస్ట్రీలో కొనసాగలనుకొని జయ జానకి నాయక సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా చేసింది. కాని ఉపయోగం లేకుండా పోయింది. సింగర్ నోయల్ ని పెళ్లి చేసుకొని కొంత కాలం కలిసి ఉన్న ఎస్తేర్ గత ఏడాది విడాకులు తీసుకొని వేరుపడింది. రీసెంట్ గా మళ్ళీ సినిమాల కోసం ట్రై చేస్తోంది. ‘ హీరోయిన్ ‘ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్తర్ బోల్డ్ క్యారెక్టర్ లో నటిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ వరసగా అవకాశాలు దక్కుతాయా లేదా.