గాసిప్స్ : వెంకీ మామని డైరెక్ట్ చేయనున్న లేటెస్ట్ హిట్ డైరెక్టర్.?

టాలీవుడ్ ఉన్నటువంటి సీనియర్ అండ్ స్టార్ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషన్స్ తో తానూ అలరిస్తూ వస్తున్నారు. మరి వెంకీ మామ అయితే ఇప్పటికే ఎన్నో అద్భుత పత్రాలు చేయగా ఇప్పుడు రానా నాయుడు సహా కొన్ని ఇతర సబ్జెక్టు లతో బిజీగా ఉన్నారు.

అయితే వెంకీ మామ రీమేక్ లు అలాగే కొత్త దర్శకులతో వర్క్ చేసేందుకు ఎప్పుడూ ఉత్సాహం కనబరుస్తారు. మరి అలాగే ఈసారి కూడా ఓ యంగ్ డైరెక్టర్ కి అయితే ఛాన్స్ ఇవ్వనున్నట్టుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ దర్శకుడు మరెవరో కూడా కాదట “హిట్” అనే సెన్సేషనల్ యూనివర్స్ ని స్టార్ట్ చేసి టాలీవుడ్ లో సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్స్ ని అందిస్తున్న యంగ్ దర్శకుడు శైలేష్ కొలను అట.

మరి ఈ యంగ్ దర్శకుడు అయితే వెంకీ మామ కోసం ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు రెడీ చేయగా ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్టే తెలుస్తుంది. కానీ ఈ చిత్రం శైలేష్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఉంటుందా లేక కొత్త సబ్జెక్టు గా ఉంటుందా అనేది మాత్రం ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.