బిగ్ ఇన్ఫో : “గుంటూరు కారం” నుంచి ఈ హీరోయిన్ అవుట్.!

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న పలు క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ సినిమా “గుంటూరు కారం” కూడా ఒకటని చెప్పాలి. అయితే ఈ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో కానీ ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు అయితే అలా వస్తూనే ఉన్నాయి.

ఇక ఈ భారీ చిత్రం విషయంలో మొదటి నుంచి ఏవోక ఇబ్బందులు వస్తుండగా ఈ ఇబ్బందుల్లో ఈ చిత్రం సినిమా షూటింగ్ డిలే అవ్వడం షూటింగ్ చేసిన సీన్స్ కూడా తీసేయడం అలాగే సంగీత దర్శకుడు థమన్ విషయంలో కూడా ఏదొక ఇబ్బంది వినిపిస్తూనే వచ్చింది.

అయితే లేటెస్ట్ గా మరో కొన్ని రూమర్స్ సినిమాపై వైరల్ కాగా వీటిపై అయితే అప్పుడు బిగ్ క్లారిటీ ఇప్పుడు బయటకి వచ్చింది. కాగా ఈ సినిమా నుంచి ఏకంగా పూజా హెగ్డే ని పక్కన పెట్టేశారట. ఏంటి త్రివిక్రమ్ సినిమా నుంచి పూజా హెగ్డే ని తప్పించడమా?? అనుకుంటున్నారా అవును ఇది నిజమే పూజా హెగ్డే ఈ సినిమా నుంచి అవుట్ అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

కాగా ఒక్క శ్రీ లీల మాత్రమే హీరోయిన్ గా ఉంటుందా లేక పూజాది హెగ్డే ప్లేస్ లో మరొకరిని పెడతారా అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అలాగే థమన్ పై రూమర్స్ లో నిజం లేదు తనని మార్చే ప్రసక్తి లేకపోగా తానే సినిమా మ్యూజిక్ వర్క్స్ అయితే ఇప్పుడు కొనసాగిస్తున్నారు. మొత్తానికి అయితే గుంటూరు కారంలో పెద్ద మార్పే వచ్చింది అని చెప్పాలి.