సామ్ “శాకుంతలం” మొదటగా ఆ హీరో దగ్గరకి వెళ్లిందట.!

ప్రెజెంట్ సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న స్టార్ హీరోయిన్స్ లో మంచి మార్కెట్ మరియు క్రేజీ ఫాలోయింగ్ ఉన్న వారిలో సమంత కూడా ఒకరు. ఇప్పటివరకు సామ్ ఎన్నో కష్టాలను చూసి ఇప్పటికీ సరైన మార్గంలో మంచి సక్సెస్ రేట్ లో దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు దాదాపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ చేస్తుండగా హీరోయిన్ గా కొన్ని మాత్రమే చేస్తుంది.

మరి గత ఏడాది “యశోద” తో మంచి సక్సెస్ ని అందుకోగా ఇక నెక్స్ట్ అంతా పాన్ ఇండియా సినీమా “శాకుంతలం” కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాని దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఈ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాపై ఐతే లేటెస్ట్ గా సమంత ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ని రివీల్ చేసింది.

ఈ సినిమాలో సమంత ది మెయిన్ లీడ్ అని అర్ధం అవుతుంది. కాగా తనకి జోడి గా కొత్త హీరో అయ్యితే దేవ్ మోహన్ అనే కొత్త నటుడు ఎంపిక అయ్యాడు. అయితే అసలు అతని రోల్ లో మరో టాలెంటెడ్ హీరో నటించాల్సి ఉందట. మరి ఆ హీరో ఎవరో కూడా కాదు తెలుగు ఆడియెన్స్ కి “సీతా రామం” తో ఎంతో దగ్గరైన దుల్కర్ సల్మాన్ అట.

తనని మొదటగా అనుకోగా అప్పటికి తాను సీతా రామం సినిమా లో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి ఛాన్స్ మిస్ అయ్యినట్టుగా తెలిపింది. ఇక ఈ భారీ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఈ ఏప్రిల్ 14 న 3డి లో గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.