గాసిప్స్ : చరణ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ నటి?

ప్రెజెంట్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తుండగా వాటిలో ఇప్పుడు దర్శకుడు శంకర్ తో ఓ పవర్ ఫుల్ సబ్జెక్టు పొలిటికల్ థ్రిల్లర్ అయినటువంటి చిత్రం “గేమ్ చేంజర్” ఒకటి కాగా ఈ చిత్రం తర్వాత అయితే చరణ్ టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు తో ఐతే తన కెరీర్ 16వ చిత్రాన్ని చేయనున్నాడు.

మరి ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కాగా దీనికి ఆల్రెడీ భారీ కాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్ ని మేకర్స్ ఎంపిక చేస్తున్నారు. కాగా ఈ చిత్రంపై ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే గత రెండు దశాబ్దాల కితం టాలీవుడ్ సినిమా దగ్గర హీరోయిన్ గా అలరించిన నటి లయ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తుంది.

ఓ కీలక రోల్ కోసం బుచ్చిబాబు అండ్ టీం ఆమెని అప్రోచ్ కాగా ఆమె ఈ పాత్రకి ఓకే కూడా చెప్పినట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది. దీనితో లయ మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్ర ద్వారా టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతుంది అని చెప్పాలి. కాగా ఈమె రీసెంట్ గా అయితే పలు ఇన్స్టా రీల్స్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి రాగ ఇపుడు మళ్ళీ సినిమాల్లోకి రాబోతుంది అని చెప్పాలి.

మరి ఈ టాక్ పై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రానికి అయితే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్వారు సహా సుకుమార్ బ్యానర్ లపై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సెప్టెంబర్ నుంచి ఐతే షూటింగ్ స్టార్ట్ కానున్నట్టుగా టాక్.