పుష్ప సినిమా విషయంలో వాళ్ళు సుకుమార్ – అల్లు అర్జున్ ని వదలడం లేదు ..?

పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ముత్యం శెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా సుకుమార్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో తయారవుతున్న హ్యాట్రిక్ సినిమా. గతంలో సుకుమార్ అల్లు అర్జున్ కి ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు పుష్ప సినిమా మీద భారీ అంచనాలున్నాయి.

Allu Arjun fight with Tiger in Pushpa - tollywood

కాగా పుష్ప సినిమాతో భారీ లెవల్ లో పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో భారీ హిట్ దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే హిందీలో కూడా అల్లు అర్జున్ తన వాయిస్ కి తనే డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య, రేసుగుర్రం, సరైనోడు లాంటి సినిమాలు హిందీలో డబ్ అయి బాగా బాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఆ రకంగా అక్కడ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక పుష్ప సినిమా తెలుగు, హిందీ తో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది.

కాగా గత కొంతకాలంగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన లొకేషన్ ఫొటోస్, వీడియోస్ లీకవుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ కి ఇలాగే జరగగా రాజమౌళి సీరియస్ గా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. కాగా రీసెంట్ గా ఫారెస్ట్ లో షూటింగ్ జరుగుతున్న పుష్ప సినిమా సెట్ నుంచి ఫొటోస్ లీకయ్యాయి. కాగా తాజాగా ఒక వీడియో లీకైనట్టు సమాచారం. మరి సుకుమార్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి. ఇప్పటికే వకీల్ సాబ్ నుంచి లీకులు చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెడుతుండగా ఇప్పుడు అదే లీకు రాయుళ్ళు సుకుమార్, అల్లు అర్జున్ ని కూడా వదలడం లేదు.