అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ అనేక రూమర్లు బయటికి వస్తున్నాయి. పెళ్లి వాళ్ళు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే క్రియేటర్లు రూమర్లు క్రియేట్ చేసే బిజీలో ఉన్నారు. నాగచైతన్య పెళ్లి నయనతార బాటలోనే నడుస్తుందని, అతని పెళ్లిని కూడా డాక్యుమెంటరీ రూపంలో తీసుకువస్తారనే కథలు పుట్టుకొచ్చాయి. నెట్ఫ్లిక్స్ ఓటీటీ లో ప్రసారం చేయబోతుందని దానికోసం నెట్ఫ్లిక్స్ 50 కోట్లు ఖర్చుపెట్టిందని కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ రూమర్స్ కి నాగ చైతన్య టీం చెక్ పెట్టింది.
సోషల్ మీడియా ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, నాగచైతన్య పెళ్లిని డాక్యుమెంటరీగా తీయడం అనే వార్త అబద్ధం అని తేల్చి చెప్పింది. చై,శోభితల వెళ్లి చాలా సింపుల్ గా ఉండబోతుందని, అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహం ఎదురుగా శోభిత మెడలో నాగచైతన్య మూడు ముళ్ళు వేస్తారని, ఏఎన్నార్ ఆశీస్సులు ఉండాలనే భావనతోనే ఇరు కుటుంబాల పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ పెళ్లి వేడుకలో కేవలం 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరవుతారని చెప్పారు.
మరోవైపు నాగచైతన్య కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభిత తనని పూర్తిగా అర్థం చేసుకుందని, ఆమెతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నానని తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా తెలుగు బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహ క్రతువుకి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతుందని దీంతో ఈ వివాహ వేడుకలు సుదీర్ఘ సమయం జరగబోతున్నాయని శోభిత సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ పెళ్లి వేడుక కోసం శోభిత నిజమైన బంగారు జరీ తో తయారుచేసిన క్లాసిక్ కాంజీవరం పట్టుచీరను పెళ్లి సమయంలో ధరించ నున్నట్లు తెలుస్తోంది సాంప్రదాయ బద్దంగా జరిగే ఈ పెళ్లి వేడుక సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య జరగబోతుంది.