గ్యాప్ ఇస్తే మహేష్ కి ఊపిరాడనిచ్చేలా లేరు వీళ్ళంతా ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం దర్శకులు క్యూ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన డేట్స్ దొరకాలే గాని యంగ్ డైరెక్టర్స్ నుంచి స్టార్ డైరెక్టర్స్ వరకు అందరూ వేయిట్ చేస్తూనే ఉంటారు. అయితే బాబు మాత్రం తనకి బాగా నచ్చిన కథ తోనే ముందుకు వెళుతున్నాడు. కథ లో చిన్న పాయింట్ తేడా అనిపించిన స్టార్ డైరెక్టర్ అన్న విషయం కూడా పట్టించుకోడు. నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నాడు. అందుకు ఉదాహరణ మహర్షి లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి నే తీసుకోవచ్చు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు చేయాల్సిన వంశీ పైడిపల్లి దర్శకత్వం లోనే.

Saaho eyes for Sarkaru Vaari Paata - tollywood

కాని మహేష్ కి వంశీ పైడిపల్లి నరేట్ చేసిన కంప్లీట్ స్క్రిప్ట్ నచ్చలేదట. దాంతో వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా మీద ముందు నుంచి మంచి బజ్ క్రియేటయింది. దానికి తోడు మహేష్ మేకోవర్.. సర్కారు వారి పాట అన్న టైటిల్ బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలు మీద తయారు చేసిన యూనివర్సల్ స్టోరీ.. అన్న ప్రచారం సినిమా మీద ఊహించని రీతిలో భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలని జరుపుకుంది.

జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతోంది. అయితే రాజమౌళి ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ సమ్మర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ అంటున్నారు. ఆ తర్వాత మహేష్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతారని తెలుస్తోంది. ఈ రకంగా చూస్తే మహేష్ సర్కారు వారి పాట తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుందని అంటున్నారు.

అందుకే రాజమౌళి సినిమా మొదలయ్యే ముందు మహేష్ మరో సినిమా చేస్తాడన్న టాక్ ఉంది. అయితే ఈ గ్యాప్ లో మహేష్ బాబు త్రివిక్రం తో సినిమా చేస్తాడని అంటున్నారు. కాని త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ డౌటే. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ పూరి జగన్నాధ్. బాబు డేట్స్ ఇవ్వాలే గాని 4-5 నెలల్లో పూరి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేస్తాడు. కాబట్టి కథ సెట్ అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చు. అలాగే లిస్ట్ లో అనిల్ రావిపూడి పేరు కూడా చేరింది. ఏదేమైనా బాబు చిన్న గ్యాప్ ఇస్తే దర్శకులు రెడీగా ఉంటున్నారు.