విజయ్ “లియో” లో అలాంటివి ఏవి ఉండవా?

ఇప్పుడు తమిళ సినిమా సహా తెలుగు సినిమా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది విజయ్ హీరోగా నటించిన సినిమా “లియో” అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగ రాజు తెరకెక్కించగా ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సినిమా అని ఇంత అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా పట్ల ఇప్పుడు ఒకో రోజు ఒకో కొత్త అంశం ఆడియెన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. ఈ చిత్రంలో చాలా వరకు రొటీన్ ఏక్షన్ సీన్స్ ఉండవట. ఈ సినిమాలో హీరో ఎంట్రీ కి ఎలాంటి ఫైట్ ఉండబోదట. అంతే కాకుండా హీరో ఎంట్రీ పై సాంగ్ కూడా ఉండదు అని లోకేష్ తాజాగా కన్ఫర్మ్ చేసాడు.

అలాగే లోకేష్ కనగ రాజు ఈ సినిమాలో ఎలాంటి పంచ్ డైలాగ్స్ ని కూడా ప్రిపేర్ చేయలేదట. కానీ ఇంటర్వెల్ బ్లాక్ లో అయితే ఓ ఊహించని బిగ్గెస్ట్ ఏక్షన్ సీక్వెన్స్ తాను ఇప్పటివరకు ఎవరూ చేయనిది ఆడియెన్స్ చూస్తారని మాత్రం లోకేష్ చెప్తున్నాడు. దీనితో లియో లో మాత్రం అందరు కోరుకునే రొటీన్ ఏక్షన్ అయితే ఉండదు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.

అయితే ట్రైలర్ చూసాక మాత్రం మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక వీటికి తోడు సినిమాలో కానీ మంచి మాస్ సర్ప్రైజ్ ఏమన్నా పడితే బాక్సాఫీస్ దగ్గర వీర లెవెల్లో ఈ సినిమాకి వసూళ్లు ఉంటాయి అని చెప్పొచ్చు. ఇంకా ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించగా విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. అలాగే అనిరుద్ సంగీతం అందించాడు.