శ్రీలీల మామూలు ముదురు కాదు సుమీ.!

శ్రీలీల.. ఇటీవలి కాలంలో ఇంతలా సినీ పరిశ్రమని దడదడ లాడించేస్తున్న హీరోయిన్ ఇంకెవరూ లేరనడం అతిశయోక్తి కాదేమో.! రష్మిక కాదు, పూజా హెగ్దే అసలే కాదు.. కీర్తి సురేష్ లాంటోళ్ళు అసలు పోటీనే కాదు.. సాయి పల్లవికీ అంత సీన్ లేదు.!

ఓన్లీ శ్రీలీల.! ఆమెకున్న ఫాలోయింగ్ అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో వుంది. ఏంటి.? ఇదంతా నిజమే.? నిజం కాదట, అంతా ఫేక్ ప్రచారమట.! ఈ ఫేక్ ప్రచారం కోసం శ్రీలీల చాలా చాలా ఖర్చు చేస్తోదంటూ సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘బలమైన పీఆర్ టీమ్’ అనే ప్రచారం వున్నా, పీఆర్ టీమ్ ముసుగులో.. ‘గాలి బుడగ’ పబ్లిసిటీ ఎక్కువైపోయిందంటూ వెటకారాలు షురూ అయ్యాయ్.

చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటో రెండో బ్యాక్ టు బ్యాక్ ఫెయిలయితే.. అంతే సంగతులు.! అంతేనా.? నిజమేనా.? సాయి పల్లవి డాన్సులతో శ్రీలీని పోల్చి, రష్మికని మరో విషయంలో శ్రీలీలతో పోల్చి.. ఫేక్ హైప్ క్రియేట్ చేస్తోంది ఎవరబ్బా.? ఎలాగబ్బా.?