సూపర్ స్టార్ కృష్ణకు శోభన్ బాబుకు చాలా తేడా ఉండేది.. అసలు విషయం చెప్పిన సీనియర్ జర్నలిస్ట్!

ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ 50 సంవత్సరాల పాటు వెండితెరపై తిరుగులేని వ్యక్తిగా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కృష్ణ గారి మృతితో తెలుగు చిత్ర సీమ గొప్ప వ్యక్తిని కోల్పోయినట్లు అయింది. కృష్ణ గారితో అనుబంధమున్న సినీ పెద్దలు అభిమానులు అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీటితో శ్రద్ధాంజలి వహిస్తున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ గారికి, అందాల నటుడు శోభన్ బాబు గారికి మధ్య ఉన్న అనుబంధం వారి మధ్య తేడాల గురించి వెల్లడించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కృష్ణ గారు ఇండస్ట్రీ లోకి వచ్చే సమయానికి శోభన్ బాబు స్టార్ హోదాలో ఎంతో ప్రేక్షకాదరణ కలిగి ఉన్నాడు. కృష్ణ గారి కంటే శోభన్ బాబు ఎంతో సీనియర్ నటుడు అయినప్పటికీ కృష్ణ ఎన్నుకున్న యాక్షన్ సినిమాలతో మాస్ ఫాలోయింగ్ పెంచుకొని అత్యధిక అభిమానులను తన వైపు తిప్పుకున్నాడని చెప్పారు. శోభన్ బాబు లాగా ఒకే జానర్ సినిమాలకు పరిమితం కాకుండా కృష్ణ అన్ని జానర్లలో సినిమాలు తీసి సక్సెస్ సాధించడంలో ముందున్నారు. శోభన్ బాబు, కృష్ణ కలిసి కృష్ణార్జునులు అనే మల్టీ స్టార్ సినిమాను తీశారు.

కృష్ణ గారితో కలిసి శోభన్ బాబు నటించిన మల్టీ స్టార్ సినిమాలో శోభన్ బాబు ప్రాధాన్యత తగ్గడంతో అప్పటినుంచి మల్టీస్టారర్ సినిమాలో నటించకూడదని శోభన్ బాబు నిర్ణయం తీసుకున్నారని అప్పటినుంచి కృష్ణ గారికి శోభన్ బాబు గారి మధ్య దూరం పెరిగిందని భరద్వాజ్ గారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే శోభన్ బాబు కలర్ సినిమాలకు మాత్రమే నిర్మాతలకు ఛాన్స్ ఇచ్చే వారిని కృష్ణ గారు బ్లాక్ అండ్ వైట్ సినిమాలతో పాటు మల్టీ స్టార్ సినిమాలకు కూడా ఓకే చెప్పేవారు. శోభన్ బాబు గారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం ఇష్టం ఉండేది కాదు కృష్ణ గారు మాత్రం చివరి వరకు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపేవారు. కృష్ణ గారి కంటే శోభన్ బాబు మార్కెట్ కొంత తక్కువగా ఉండేదని కృష్ణ గారి సినిమా విడుదలైన వారానికి నిర్మాతలకు డబ్బులు వచ్చేవని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.