స్టార్ నటి సమంత తాజాగా తన పెంపుడు శునకం సాషాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఈ ఫొటోకు ‘సాషా ప్రేమ లాంటి ప్రేమ మరొకటి లేదు’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. స్టార్ నటి సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య కొత్త బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరోనటి శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేశారు. వీరి వివాహం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
అయితే, వీరి వివాహం వేళ సమంత పెడుతున్న పోస్ట్‌లు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. నాలుగు రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి కుస్తీ పోటీలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన సమంత.. తాజాగా తన పెంపుడు శునకం సాషాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఈ ఫొటోకు ‘సాషా ప్రేమ లాంటి ప్రేమ మరొకటి లేదు’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, సామ్ గత కొంతకాలంగా గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల అనంతరం కొద్దిరోజులకే మయోసైటిస్ బారిన పడింది. దాన్నుంచి కోలుకునేందుకు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే.. మళ్లీ తిరిగి తన వర్క్‌లైఫ్‌లో బిజీగా మారుతుండగా ఇంతలో తన తండ్రి జోసెఫ్ ప్రభు హఠాత్తుగా మరణించారు. మరోవైపు మాజీ భర్త మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర మనోవేదనలో ఉన్న సామ్‌కు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.