చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా చేయటానికి కారణం ఆ స్టార్ హీరో..?

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాని తెలుగులో నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు నయనతార సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో హీరోయిన్ లు కీలక పాత్రలలో నటించారు.

అక్టోబర్ 5వ తేదీన దసరా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ పనులలో బిజీగా ఉంది. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా… ఈ సినిమా గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో తీయటానికి ముఖ్య కారణం రామ్ చరణ్ అంటూ చెప్పుకొచ్చాడు.

‘లూసిఫర్’ సినిమా తెలుగులో రీమేక్ చేయమని,మీ ఇమేజ్‌కి ఈ సినిమా బావుంటుంది..’ అని రామ్ చరణ్ చిరంజీవికి సూచించాడట. అంతే కాకుండా ఈ సినిమాకి దర్శకుడు మోహన్ రాజాని కూడా రామ్ చరణ్ ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించటానికి ముఖ్య కారణం కూడా రామ్ చరణ్ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమా కోసం రామ్ చరణ్ తెరవెనుక చాలా కష్టపడ్డాడు.