చిన్న సినిమాల జోరు… ఆడియన్స్ మాత్రం వచ్చేలా లేరు

ఒకప్పుడు థియేటర్స్ లో మినిమమ్ బజ్ తో సినిమా పడింది అంటే ప్రేక్షకులు క్యూ కట్టేవారు. ఎవరేజ్ టాక్ వచ్చిన కూడా బ్రేక్ ఎవెన్ ఈజీగా వచ్చేసేది. అయితే కరోనా తర్వాత ఒటీటీల ఆధిపత్యం విపరీతంగా పెరిగింది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాని నెల రోజులు తిరక్కుండానే ఒటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దానికి తోడు థియేటర్స్ లో టికెట్ రెట్లు ఒకప్పటితో పోల్చుకుంటే విపరీతంగా పెరిగాయి.

ఇదిలా ఉంటే గత నెలలో ఎక్కువ చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే వాటిని చూసేందుకు ఆడియన్స్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. విరూపాక్ష తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోలేదు. కొద్దిలో కొద్దిగా మేమ్ ఫేమస్ సినిమా యూత్ కి కనెక్ట్ కావడం, నైజాంలో గట్టిగా ప్రమోట్ చేయడంతో బ్రేక్ ఎవెన్ అయితే సాధించేశింది.

ఇక డబ్బింగ్ సినిమాగా వచ్చిన విజయ్ అంటోనీ బిచ్చగాడు 2 మూవీపై మొదటి సినిమా ప్రభావం ఉండటంతో కొంత వరకు మాస్ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యింది. అలాగే విజయ్ అంటోనీ చిత్రాలు ఇష్టపడే వర్గం కూడా టాలీవుడ్ లో ఉన్నారు. ఈ కారణంగా బ్రేక్ ఎవెన్ ని ఈ మూవీ అందుకుంది. నరేష్ మళ్ళీ పెళ్లికి రెండో రోజే షట్టర్స్ క్లోజ్ అయిపోయాయి.

ఇక రానా నిర్మించిన పరేషాన్ మూవీని గట్టిగానే ప్రమోట్ చేశారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ కావడంతో హిట్ పక్కా అనుకున్నారు. అయితే సినిమాలో తాగడం, తినడం తప్ప కంటెంట్ లో దమ్ము లేదని ప్రేక్షకులు తేల్చేశారు. దీంతో సినిమా డిజాస్టర్ లిస్టులోకి వెళ్ళిపోయింది. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అహింస మూవీ ఏ యాంగిల్ లో కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు.

దీంతో ఈ సినిమాకి ప్రేక్షకులు కరువయ్యారు. అలాగే బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా వచ్చిన నేను స్టూడెంట్ సార్ మూవీ ట్రైలర్ తో అంచనాలు క్రియేట్ చేసింది. కాని రిలీజ్ తర్వాత మూవీలో ప్రేక్షకులని అలరించే దమ్ము లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి స్పందన నిల్ అయిపొయింది. ఈ వారం సిద్దార్ద్ డబ్బింగ్ మూవీ టక్కర్, బిగ్ బాస్ ఫేమ్ సన్నీ అన్ స్టాపబుల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. వీటిలో ఏది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందనేది వేచి చూడాలి.