మహేష్ బాబు చేయలేని పనిని చేసి చూపిస్తా అంటున్న రౌడీ హీరో… మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలియని వారంటూ ఉండరు. పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత విజయ నటించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలు వరుసగా హిట్ అవటంతో స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆగష్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్,టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ మహేష్ బాబుతో జనగణమన అనే సినిమా తీయాలని చాలా కాలం ఎదురు చూశాడు. అయితే మహేష్ బాబుకి సమయం కుదరకపోవడంతో ఆ సినిమా చేయలేకపోయాడు. దీంతో జనగణమన స్క్రిప్ట్ తిరిగి విజయ్ దేవరకొండ వద్దకు వచ్చింది. సినిమా స్టోరీ నచ్చటంతో విజయ్ కూడా ఆ సినిమా చేయటానికి అంగీకరించాడు. ఇటీవల జనగణమన సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మహేష్ బాబు నటించలేని జనగణమన సినిమాలో నేను నటించి వాళ్ళందరూ గర్వపడేలా చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మహేష్ బాబు అభిమానులు విజయ్ దేవరకొండ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. విజయ్ చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకొని విమర్శలు చేస్తున్నారు.