చిత్ర బృందానికి ఐఫోన్లను గిఫ్ట్ గా ఇచ్చిన ప్రొడ్యూసర్.. సినిమాపై అంత నమ్మకమా?

సాధారణంగా సినిమా విడుదల అయ్యి మంచి హిట్ అందుకుంటే చిత్ర బృందానికి నిర్మాతలు గిఫ్ట్ లు ఇవ్వడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతుంది. అయితే దర్శకుడికి హీరోకి ఖరీదైన కానుకలను ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు హీరోలకు దర్శకులకు ఖరీదైన కార్లను కానుకగా ఇవ్వడం మనం చూస్తున్నాము. అయితే తాజాగా నిర్మాత చెరుకూరి సుధాకర్ సినిమా విడుదల కాకుండానే చిత్ర బృందానికి ఏకంగా 28 ఐఫోన్లను కానుకగా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

చెరుకూరి సుధాకర్ నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నటువంటి చిత్రం దసరా. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల కానుంది. బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈ సినిమాపై నమ్మకంతో ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుందన్న ఉద్దేశంతో నిర్మాత సుధాకర్ చిత్ర బృందానికి సరికొత్త వెర్షన్ ఐఫోన్ 14 మొబైల్ ఫోన్లను కానుకగా ఇచ్చినట్టు సమాచారం.

ఇలా చిత్ర బృందానికి ఏకంగా 28 ఐఫోన్లను కానుకగా ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది తెలిసినటువంటి ఎంతోమంది నెటిజన్ లు సినిమా విడుదల కాకుండానే ఇలా కానుకలు ఇవ్వడం ఏంటి సినిమాపై నిర్మాతకు అంత నమ్మకమా… అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్లు టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.