నేచురల్ స్టార్ నాని సినిమాల్లో సెంటిమెంట్ ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన ఎమోషన్‌గా నిలుస్తూనే ఉంది. తాజాగా, ఆయన హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో కూడా తల్లి కొడుకు అనుబంధాన్ని పవర్‌ఫుల్‌గా మలచబోతోందని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈమె పాత్ర నానికి తల్లిగా కీలకంగా ఉండబోతోందని టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది.
సోనాలి కులకర్ణి హిందీలో దిల్ ఛాహతా హై, భరత్ వంటి సినిమాల్లో నటించగా, ఇప్పుడు తొలిసారి తెలుగులో ది ప్యారడైజ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో బాహుబలి, సలార్, కేజీఎఫ్ వంటి సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఎంత బలంగా పని చేసిందో తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల కూడా అదే రూట్‌ను ఫాలో అవుతూ, తల్లి పాత్రను మరింత హై ఎమోషనల్‌గా మలచబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే, సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగేలా ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. డైలాగ్స్ ను బట్టి రక్తం పోసి పెంచిన కొడుకు..అనే థీమ్ మరింత హైప్ క్రియేట్ చేసింది. అలా చూస్తే, తల్లి పాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది. నాని రా మాస్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ది ప్యారడైజ్ తో సోనాలి కులకర్ణి లుక్ కూడా స్పెషల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.
బాలీవుడ్, మరాఠీ ఇండస్ట్రీలో ఆమె ఎమోషనల్ రోల్స్‌లో అద్భుతంగా నటించిందనే క్రెడిబిలిటీ టాలీవుడ్‌లోనూ పనిచేయొచ్చు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో దసరా సినిమాతో తన మార్క్ ప్రూవ్ చేసిన విధంగా, ఈ సినిమాలోనూ మాఫియా యాక్షన్‌కు కుటుంబ అనుబంధాలను అద్భుతంగా మిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నాని కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలవబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.