‘అయలాన్‌’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్‌!

ఈ ఏడాది ‘మహావీరుడు’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌. ఇక శివకార్తికేయన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘అయలాన్‌’. (తమిళంలో ‘అయలాన్‌’ అంటే ‘ఏలియన్‌’ అని అర్థం) ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథనాయికగా నటిస్తుంది.

ఆర్‌.రవికుమార్‌ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్‌ లాంఛ్‌ చేసిన ‘అయలాన్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. శివకార్తికేయన్‌ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్‌ కూడా వెళ్తున్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మూవీ టీజర్‌కు మేకర్స్‌ ముహూర్తం ఫిక్స్‌ చేశారు. అయలాన్‌ టీజర్‌ను అక్టోబర్‌ 06న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీనితో పాటు ఒక ఫొటో కూడా వదిలింది.

ఈ ఫొటోలో ఏ.ఆర్‌.రెహమాన్‌తో పాటు శివకార్తికేయన్‌, రవికుమార్‌, గ్రహాంతర వాసి టీజర్‌ కోసం చూస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది!