సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన మెకానిక్ రాఖీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

హిట్స్,ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విశ్వక్ సేన్. ఈ సంవత్సరం గామి, గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలతో మెప్పించాడు. అయితే ఆ సినిమాలు అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే మొన్న నవంబర్ 22న మెకానిక్ రాఖీ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు విశ్వక్సేన్.

అయితే ఈ సినిమాకి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో విశ్వక్సేన్ నటనకి మంచి మార్కులు పడ్డాయి కానీ కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సెకండ్ హాఫ్ లో ఉన్న స్టఫ్ ఫస్ట్ ఆఫ్ లో లేకపోవడం వలన సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. థియేటర్స్ రన్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా నేటి నుంచే అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మెకానిక్ గ్యారేజ్ తో పాటు డ్రైవింగ్ స్కూల్ కూడా నడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో హీరో నాన్న మరణిస్తారు. మాయ, ప్రియా ఇద్దరూ రాఖీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవటానికి వస్తారు . మరోవైపు రంకి రెడ్డి అనే వ్యక్తి మెకానిక్ షెడ్ ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తాడు.

ప్రియ కాలేజీ చదివే రోజుల్లో తన మనసుకు దగ్గర అయిన అమ్మాయి, తన ఫ్రెండ్ కి చెల్లెలు కూడా. ఆమెతో లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యే లోపే అనుకోని కారణాల వలన రాఖి కాలేజీ డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. అయితే చాలా రోజుల తర్వాత కలిసిన ప్రియా గురించి రాఖీకి తెలిసిన కొత్త విషయాలు ఏమిటి, ప్రియ కోసం రాఖి ఏం చేస్తాడు, వాళ్ళిద్దరి జీవితాల్లోకి వచ్చిన మాయ వారి జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుంది ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.