సినిమాలలో ప్రస్తుతం హీరో, హీరోయిన్స్ మధ్య లిప్ కిస్ సన్నివేశాలు సర్వసాధారణం అయిపోయాయి. స్టార్ హీరోయిన్ కావాలని అనుకునే అమ్మాయిలు అందరూ లిప్ కిస్ సన్నివేశాలు చేయడానికి ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అలాగే క్యారెక్టర్ డిమాండ్ బట్టి దర్శకుడు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేయమంటే వాటిని ధరించడానికి కూడా సిద్ధంగా ఉంటారు.
అయితే 90వ దశకంలో లిప్ లాక్ సన్నివేశాలు అనే మాట ఉండేది కాదు. హీరో, హీరోయిన్స్ మధ్య సాన్నిహిత్యం చూపించాలన్నా కూడా ఆచితూచి దర్శకులు నిర్ణయం తీసుకునేవారు. కొన్నిసందర్భాలలో ఏ పువ్వులు వికరించినట్లు చూపించేవారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ముద్దు సన్నివేశాలు కూడా సినిమాలలో స్టార్ట్ అయ్యాయి. కొంత వ్యతిరేకత అయితే వచ్చేది.
కాని దర్శకులు ధైర్యం చేసి అలాంటివి చిత్రీకరించేవారు. అలాగే ఓ సీరియల్ లో కూడా హీరో, హీరోయిన్స్ మధ్య లిప్ కిస్ ని దర్శకుడు తెరకెక్కించారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ వెలుగొందిన నీనాగుప్తా ప్రస్తుతం బామ్మ పాత్రలలో నటిస్తోంది. హిందీలో తెరకెక్కిన వెబ్ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ 2లో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా తన ఫస్ట్ కిస్ గురించి నీనా గుప్తా ఓపెన్ గా చెప్పింది.
90వ దశకంలో దిల్లగి అనే సీరియల్ లో తన సహనటుడు దిలీప్ ధావన్ తో కిస్సింగ్ సన్నివేశం చేసింది. ఈ సీన్ అయితే సీరియల్ ప్రమోషన్ కి ఉపయోగపడింది. అయితే చాలా ఇబ్బందికరంగానే ఆ లిప్ కిస్ సీన్ చేసానని నీనా గుప్తా తెలిపారు. లిప్ కిస్ చేసిన తర్వాత వెంటనే వెళ్లి డెటాల్ తో మౌత్ వాష్ చేసుకున్నాను. ఎందుకో భయమేసింది.
అంత కష్టపడి చేసిన ఆ సన్నివేశానికి తరువాత ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో దర్శకుడు ఆ సన్నివేశం తొలగించాల్సి వచ్చిందని నీనా గుప్తా క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే లస్ట్ స్టోరీస్ 2 లో మృణాల్ ఠాకూర్ బామ్మగా నీనా గుప్తా నటిస్తోంది. పెళ్ళికి ముందు ఆ అనుభవం ఉండాలంటూ కొన్ని బోల్డ్ డైలాగ్స్ ని నీనా గుప్తా క్యారెక్టర్ తో లస్ట్ స్టోరీస్ 2లో చెప్పించడం విశేషం.