తన కల నెరవేరిందంటున్న కలర్ ఫోటో దర్శకుడు.. కంగ్రాట్స్ చెప్పిన డైరెక్టర్ హరీష్ శంకర్!

నందమూరి నటసింహం బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్న డాకు మహారాజ్ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమాలో కలర్ ఫోటో దర్శకుడు సందీప్ కీలక పాత్ర పోషించాడు ట్రైలర్లో తాను కనిపించిన ఫ్రేమ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు విజయవాడ కి చెందిన తాను స్కూల్ చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాల్లోకి రావాలని ఎన్నో కలలు కన్నట్లో తెలిపాడు ` ఇప్పుడా క‌ల బాల‌య్య బాబు సినిమా తో నెర‌వేరుతుంది.

అయితే అందుకు కార‌ణం ద‌ర్శ‌కుడు బాబి అని తెలిపారు. ఆయ‌న అవ‌కాశం ఇవ్వ‌డంతోనే ఇది సాధ్యమైంద‌ని కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫోటో. సాయి రాజేశ్ నీలం, బెన్నీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా 2020 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం జాతీయ అవార్డును నదుకోవడం విశేషం.

దర్శకుడుగా సక్సెస్ అయినా సందీప్ రాజ్ నటనలో కూడా సక్సెస్ అవ్వాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఈ ట్వీట్ మీద హరీష్ శంకర్ స్పందించాడు. ఓ పెద్ద సినిమా ఫస్ట్ ఆడిషన్ చేసింది ఎవరు బాబు? అంటూ హరీష్ శంకర్ ప్రశ్నించాడు. డాకులో నటించినందుకు కంగ్రాట్స్.. ట్రైలర్ అదిరిపోయింది.. నట సింహం స్క్రీన్ ప్రజెన్స్ నెక్ట్స్ లెవెల్.. బాబీ, తమన్ అదరగొట్టేశారు అంటూ హరీష్ శంకర్ ట్వీట్ వేశాడు.