రవతేజ సినిమాలకి ఆ ఖర్చు ఎక్కువైపోతోందట.!

మాస్ రాజా రవితేజ సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతున్నాయ్. వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నాడు రవితేజ. కానీ, ఒక్క సినిమా కూడా నిలబడడం లేదు. అన్నింటికీ మించి రవితేజ సినిమాలకు భారీగా ఖర్చవుతోందట. ట్విస్ట్ ఏంటంటే, ఆ ఖర్చు సినిమా కోసం కాదు, రవితేజ మేకప్ కోసమట.

సిక్స్ ప్యాక్ పేరు చెప్పి రవితేజ హ్యాండ్సమ్ లుక్స్ మొత్తం కరిగిపోయాయ్. ముఖ్యంగా ముఖం ముడతలతో నిండిపోయింది. ఆ ముడతల్ని కవర్ చేయడానికి మేకప్ ఆర్టిస్టులు మల్లగుల్లాలు పడుతున్నారట. తెరపై ఆ ముడతలు కనిపించకుండా వుండేందుకు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోందట. సినిమా ఖర్చుకు మించి అదనంగా రవితేజ మేకప్ కోసం ఖర్చవుతోందట.

అసలే రవితేజ ఈ మధ్య యంగ్ హీరోయిన్లతో ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కి కక్కుర్తి పడుతున్నాడన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. ఆ యంగ్ హీరోయిన్ల పక్కన రవితేజ ముఖాన్ని కవర్ చేయడం పెద్ద తలనొప్పిగా మారిందట. తాజా మూవీ ‘ధమాకా’ విషయంలో ఆ తలనొప్పి మరింత ఎక్కువైందనీ తెర వెనక ముచ్చట. అందుకు కారణం ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా తెచ్చుకున్నాడు రవితేజ. శ్రీలీల క్యూట్ ఫీచర్స్ ముందు రవితేజ బా..గా.. తేలిపోతాడుగా.!