నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈయన నటించిన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాతో పరవాలేదు అనిపించుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నాగచైతన్య తాను థియేటర్ కి వెళ్లి ఎందుకు సినిమాలు చూడరు అనే విషయం గురించి ఓపెన్ అయ్యారు.
ఈ క్రమంలోనే నాగచైతన్య మాట్లాడుతూ.. తాను మొట్టమొదటి సారిగా నటించిన జోష్ సినిమా విడుదలైన సమయంలో ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందో చూడటం కోసం నాగచైతన్య కూడా థియేటర్ కి వెళ్లి సినిమాని చూశారట. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకులను ఎంతో సందడి చేసిందని అప్పటివరకు ప్రేక్షకులు కూడా సినిమాని బాగా ఎంజాయ్ చేస్తూ చూశారని నాగచైతన్య వెల్లడించారు.ఇక సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి ఒక్కొక్కరుగా థియేటర్ నుంచి బయటికి వెళ్లిపోవడం తనని చాలా బాధ పెట్టిందని నాగచైతన్య తెలిపారు.
ఈ విధంగా ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవడంతో ఇలా మధ్యలోనే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయిన ఆ ఘటన ఇప్పటికీ నా మెదడులో మెదలుతూనే ఉందని అందుకే అప్పటినుంచి థియేటర్ కి వెళ్లి సినిమా చూడకూడదని ఫిక్స్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా ఈయనకి ఉన్న థియేటర్ సెంటిమెంట్ గురించి అసలు విషయం చెప్పారు. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.