నాని 28 కి ‘అంటే.. సుందరానికీ’ అన్న టైటిల్ అందుకే పెట్టాట..?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తో టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ డిసెంబర్ వరకు టక్ జగదీష్ కంప్లీటవబోతోందని సమాచారం.

Nani's Tuck Jagadish is inspired by?

ఇక ఈ సినిమా తర్వాత టాక్సీ వాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అన్న సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. సాయి పల్లవి, ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎక్కువ భాగం కలకత్తా బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. అందుకే ఇక్కడే భారీ బడ్జెట్ తో సెట్ ని కూడా నిర్మిస్తున్నారట.

ఈ సినిమా తర్వాత నాని తన 28 వ గా ‘అంటే.. సుందరానికీ’ అన్న వెరైటీ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. రీసెంట్ గా ఈ సినిమాని ప్రకటించిన మేకర్స్ తాజాగా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సినిమాతో మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. కాగా యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాని క్యారెక్టర్ కి అత్యుత్సాహం ఉంటుందని ప్రతీ విషయంలో తొందపాటుగా ప్రవర్తిస్తాడని తెలుస్తోంది.

Nani's Ante Sundaraniki | TeluguBulletin.com

అలా తొందరపాటు లో జరిగే విషయాల వల్ల నాని ఇబ్బందులో పడుతుంటాడని అందులో నుంచి బోలెడంత హాస్యం పుట్టుకొస్తుందని ఆ కారణంగానే ఈ సినిమాకి ‘అంటే.. సుందరానికీ’ అన్న టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. నిజంగా ఇదే గనక కథ అయితే ఖచ్చితంగా నాని కి భలే భలే మగాడివోయ్ లాంటి భారీ హిట్ గ్యారెంటీ అంటున్నారు.