గర్బవతిగా అనసూయ కష్టాలు.. లిఫ్ట్‌లో ప్రసవం?

Thank You Brother Motion Poster is Anasuya Bharadwaj Delivers In Lift

అనసూయ చేసే సినిమాలు ఎంపిక చేసుకునే స్క్రిప్ట్‌లు ఎంత కొత్తగా యూనిక్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ లాక్డౌన్ సంఘటనల ఆధారంగా థ్యాంక్యూ బ్రదర్ అనే కొత్త సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్లతో భారీ హైప్ క్రియేట్ చేసింది యూనిట్. ఇందులో అనసూయ గర్భవతిగా నటిస్తోన్నసంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రధానంగా లిఫ్ట్‌లొ జరిగే సంఘటనలే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు థ్యాంక్యూ బ్రదర్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ మోషన్ పోస్టర్‌లోనే సినిమా కథేంటో నేపథ్యం ఏంటో అర్థం అవుతోంది. నెలలు నిండిన గర్భవతిగా అనసూయ.. లిఫ్ట్‌లో ఇరుక్కుంటున్నట్టు.. అందులో మరో వ్యక్తి కూడా ఉంటున్నట్టు కనిపిస్తోంది. అసలే లాక్డౌన్ సమయం. సాయం చేసేందుకు ఎవ్వరూ లేన్నట్టు చూపించాడు. అనసూయ ప్రియా పాత్రలో, విరాజ్ అశ్విన్ అభి క్యారెక్టర్‌లో జీవించినట్టు కనిపిస్తోంది.

Thank You Brother Motion Poster is Anasuya Bharadwaj Delivers In Lift
Thank You Brother Motion Poster is Anasuya Bharadwaj Delivers In Lift

అయితే ఈ లిఫ్ట్ మధ్యలో స్ట్రక్ అయినట్టు.. సాయం కోసం అభి అరుస్తున్నట్టు మోషన్ పోస్టర్‌లో చూపించారు. అనసూయ ప్రసవ వేదనను అనుభవిస్తున్నట్టు రివీల్ చేశారు. చూస్తుంటే లిఫ్ట్‌లోనే అనసూయ ప్రసవించనున్నట్టు.. క్లైమాక్స్‌లో ఎమోషన్ ఓ రేంజ్‌లో పండించేలా కనిపిస్తోంది. మొత్తానికి అనసూయకు ఇది మంచి పేరు తెచ్చే పాత్రలానే కనిపిస్తోంది. ఇది చూస్తుంటే ఎంతో థ్రిల్లింగ్ ఉందంటూ మహేష్ బాబు మోషన్ పోస్టర్‌పై ప్రశంసలు కురిపించాడు.