Thamma Reddy: అల్లు అర్జున్ వల్ల ఇండస్ట్రీ మొత్తం తలవంచింది…. ఫైర్ అయిన తమ్మారెడ్డి?

Thamma Reddy: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సినిమా సెలబ్రిటీలు ఏమాత్రం సంతోషంగా లేరని తెలుస్తుంది. అసెంబ్లీలో ఈ ఘటన గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తెలంగాణలో ఎలాంటి అదనపు షోలు ఉండవు అదేవిధంగా సినిమాలకు టికెట్ల రేట్లు కూడా పెంచనని తెలియజేశారు. ఈ విషయంపై నిన్న సినిమా సెలబ్రిటీలందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.

ఇలా రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు బేటి అయిన తరుణంలో ఆయన ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నానని తాను తన మాటను వెనక్కి తీసుకోవడం లేదు అంటూ సినిమా టికెట్ల రేట్లు పెంచును అదనపు షోలకు అనుమతి ఇవ్వనని తెలిపారు. దీంతో చేసేదేమీ లేక సినీ పెద్దలు వెనుతిరిగారు. ఇక ఈ భేటీ అనంతరం పలువురు సినీ సెలబ్రిటీలు అల్లు అర్జున్ ని తప్పు పడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.

ఈ సందర్భంగా సీనియర్ నటుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ ని పూర్తిస్థాయిలో తప్పుపట్టారు. ఒక్క మనిషి కోసం.. ఆయన మర్డర్ చేశాడని నేను అనడం లేదు. అయితే తప్పు అయితే జరిగింది. రోడ్ షో చేయడం వల్ల తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. తప్పు జరిగిన తర్వాత మళ్లీ దాన్ని కవర్ చేయడానికి కొన్ని అబద్దాలు ఆడడం వల్ల ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా నేడు ముఖ్యమంత్రి ముందు కూర్చవలసిన పరిస్థితి వచ్చింది.

కేవలం ఒక మనిషి కోసం ఆ మనిషి ఇగో కోసం నేడు సినీ పెద్దలందరూ కూడా ప్రభుత్వం ముందు తల దించాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.