‘లూసిఫ‌ర్’ కి సంగీతం అందించనున్న థమన్ .. నా బిగెస్ట్ డ్రీమ్ అంటూ ఎగ్జైట్మెంట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా 153వ చిత్రం జ‌న‌వ‌రి 21న లాంఛ‌నంగా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ చేసిన లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ చేయబోతున్నారు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు, మల‌యాళంలో మోహ‌న్‌ లాల్ మిన‌హా.. మంజు వారియ‌ర్‌, వివేక్ ఒబెరాయ్‌, పృథ్వీరాజ్‌, టోవినో థామ‌స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Chiranjeevi Lucifer Remake official announcement

మంజు వారియ‌ర్ పాత్ర‌ను న‌య‌న‌తార చేస్తుంటే.. వివేక్ ఒబెరాయ్ పాత్ర‌ను స‌త్య‌దేవ్ చేస్తున్నాడు. కాగా.. టోవినో థామ‌స్ పాత్ర‌ను అభిజీత్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. కాగా.. పృథ్వీరాజ్ పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తార‌నే దానిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్స్ పేరు ప్ర‌ముఖంగా వినిపించాయి. తెలుగులో రీమేక్‌కి బైరెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే .. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా థమన్ కి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ ట్విట్ చేశాడు. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బాస్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది ఓ గొప్ప అనుభూతి , బాస్ మెగాస్టార్ సినిమాకి కంపోజ్ చేయడం అనేది ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కి బిగెస్ట్ డ్రీమ్. ఇప్పటికి నా కల తీరబోతుంది. మా బాస్ మెగాస్టార్ పై ఉన్న ప్రేమని చాటుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. బాస్ తో కలిసి లూసిఫర్ కోసం ప్రయాణం చేయబోతున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా థమన్ తెలియజేశాడు. ఇకపోతే , సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా థమన్ అని చెప్పాలేమో. ఈ ఏడాది ఒకటి రెండు కాదు ప్రస్తుతం 9 సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.