థమన్ చెప్పాడంటే చేసి తీరతాడు.. వచ్చే ఏడాదంతా సర్కారు వారి పాటే ..?

థమన్ మ్యూజిక్ మీద ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలంతా క్రేజీగా ఉన్నారు. థమన్ తమ సినిమాకు మ్యూజిక్ ఇస్తే సినిమా ఆడియో పరంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఒక సినిమా రిలీజ్ కి ముందే ఆడియో పరంగా ప్రేక్షకులను మెప్పిస్తే ఖచ్చితంగా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ ఫిక్సైపోతున్నారు. థమన్ ఆ నమ్మకాన్ని మేకర్స్ లో బాగా కలిగించాడు. థమన్ అంటే ఇప్పుడు అందరికీ సెంటిమెంట్ కూడా అయిపోయింది.

music-director-ss-thaman-praises-superstar-mahesh-babu - PrinceMahesh.Com

గతంలో థమన్ మ్యూజి మీద సెటైర్స్ కామెంట్స్ వినిపించేవి. కాని ఇప్పుడు తన మార్క్ మొత్తం మార్చుకున్నాడు. ప్రశంసలు అందుకున్నాడు. రికార్డ్ స్థాయిలో సినిమాకి ఆల్బం ఇచ్చి టాలీవుడ్ లో థమన్ ది బెస్ట్ అనిపించించుకున్నాడు. థమన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజ రవితేజ తో సహా పలువురు స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ ఇస్తున్నాడు. గతంలో థమన్ .. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగడు, బిజినెస్ మాన్ లాంటి సినిమాలకి సూపర్ హిట్ ఆల్బం ఇచ్చాడు.

Sarkaru Vaari Paata: That's A Big Twist!

ఆ తర్వాత 7 ఏళ్ళు థమన్ కి మహేష్ బాబు సినిమాలకి మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కలేదు. ఎట్టకేలకి అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ క్రియేట్ చేసిన కొత్త రికార్డ్స్ కి మహేష్ బాబు ఏరికోరి థమన్ కి మ్యూజిక్ అందించే బాధ్యత అప్పగించాడు. దాంతో థమన్ కి టన్నులకొద్ది బలం వచ్చేసింది. కొత్త తరహా ట్యూన్స్ సిద్దం చేసి మహేష్ బాబు కోసం వేయిట్ చేస్తున్నాడట. అంతేకాదు మహేష్ కెరీర్ లో ది బెస్ట్ ఆల్బం గా సర్కారు వారి పాట నిలిచేలా సాంగ్స్ ఇస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. అల వైకుంఠపురములో సినిమా ఆల్బం తో సెన్షేషన్ ని క్రియేట్ చేసిన థమన్ సర్కారు వారి పాట సినిమాకి ఎలాంటి ఆల్బం ఇస్తాడో చూడాలి.