Latest Song Of Sarkaru : “సర్కారు వారి పాట” టైటిల్ సాంగ్..ఈ విషయంలో నిరాశ పరిచిన థమన్.!

Latest Song Of Sarkaru : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మూడు వరుస హిట్స్ తర్వాత మహేష్ బాబు మరో హిట్ దర్శకుడు పరశురామ్ పెట్లతో చేసిన సినిమా ఇది కావడంతో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో మహేష్ డ్రెస్సింగ్ హైలైట్ కాగా తన రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండడంతో మరింత ఆసక్తి ఈ సినిమాపై నెలకొంది. అయితే ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఒకో సాంగ్ ని రిలీజ్ చేస్తూ వస్తుండగా సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన ప్రతి సాంగ్ అదిరే హిట్ అయ్యింది.
అలా ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్ అనంతరం ఇప్పుడు సినిమా మోస్ట్ అవైటెడ్ సాంగ్ టైటిల్ ట్రాక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ అంతా బాగానే ఉంది. అనంత్ శ్రీరామ్ ఇచ్చిన లిరిక్స్ గాని థమన్ ఇచ్చిన మ్యూజిక్ గాని అంతా బానే ఉంది కాకపోతే అభిమానుల్లో మాత్రం చిన్న కంప్లైంట్ లేస్తుంది.
ఇంత బాగున్నా పాటని కేవలం 3 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ముగించేయడం అభిమానులకి నిరాశ పరిచింది. దీనితో థమన్ ఈ సాంగ్ ని మరింత పొడిగించి ఉంటే బాగుండు అనే అభిప్రాయం అందరిలో రేగింది. మరి సినిమాలో కూడా ఇంతే ఉంటే అది మరో డిజప్పాయింట్మెంట్ అవుతుంది.
https://www.youtube.com/watch?v=EqyKcZibh-Y