Sarkaaru vaari paata: సర్కారు వారి పాట సినిమా గురించి మరో హింట్ ఇచ్చిన థమన్..!

Sarkaaru vaari paata: ప్రస్తుతం తమన్ టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తమ చేసిన పాటలు యూ ట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం తమన్ పాటల కంటే కూడా నేపధ్య సంగీతంతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల వచ్చిన అఖండ సినిమా నేపథ్య సంగీతం తో అభిమానులు ఎంతో ఆకట్టుకునే తెలిసిందే.సెకండాఫ్ లో థియేటర్ లో భారీగా తన సంగీతంతో ప్రేక్షకులను మెప్పించాడు.  సినిమా చేసిన నిర్మాణ సంస్థల కంటే కూడా తమ సినిమా గురించి ఎక్కువగా లీకులు అందిస్తూ ఉంటాడు. ఒకవైపు తనపై విమర్శలు కూడా బాగానే వస్తుంటాయి ఆయన కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.

అఖండ సినిమా తర్వాత థమన్ సంగీతం పై అంచనాలు పెరిగాయి. తాజాగా మహేష్ బాబు సినిమా అయిన సర్కారు వారి పాట సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. మొదటగా విడుదలైన కళావతి సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ పాట యూ ట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాత వచ్చిన పెన్ని పాట సితార తో వున్న వీడియో విడుదల చేయడం తో రిసీర్డ్స్ క్రియేట్ చేసింది.

తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా పై అప్డేట్ ఇచ్చి సూపర్ స్టార్ అభిమానులను అలరించాడు. అయితే ఈ సినిమా యొక్క నేపథ్య సంగీతం వేరే స్థాయిలో ఉంటుందని మొదటి నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వారి ఆశలకు తగ్గట్లుగానే ఈ సినిమా యొక్క నేపథ్య సంగీతం తప్పకుండా దుమ్మురేపుతున్నని చెబుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా చూసిన తరువాత మీరందరూ ఇష్ట పడతారు అని చెప్పాడు. ఇప్పటికే నేపథ్య సంగీతానికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి అని పేర్కొన్నాడు.