సెన్సార్ లేకుండా కేజ్రీగా “లియో” ట్రైలర్..విజయ్ వర్సెస్ విజయ్

తమిళ సినిమా నాట మాసివ్ క్రేజ్ ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో దళపతి విజయ్ కూడా ఒకడు. మరి విజయ్ కెరీర్ లో నటించిన లేటెస్ట్ భారీ చిత్రమే “లియో” కాగా ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అయితే తెరకెక్కించాడు. మరి మరి తన మార్క్ స్పీడ్ లో కంప్లీట్ చేసేసిన ఈ చిత్రం గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా దసరా కానుకగా రాబోతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ చూసాక మాత్రం చాలా మందిలో అనేక డౌట్స్ రావచ్చు కానీ లోకేష్ మాత్రం గతంలో విక్రమ్ కి కూడా కాస్త సింపుల్ గానే ఇచ్చినట్టుగా అనిపించింది కానీ సినిమా రిలీజ్ అయ్యాక లోకేష్ తన సత్తా చూపించాడు.

అయితే ఈ చిత్రం ట్రైలర్ లో క్రేజీ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మొదటగా అయితే సెన్సార్ లేకుండా ఓ సైకో పాత్రని పరిచయం చేయడం నెక్స్ట్ అర్జున్ ని ఆ తర్వాత సంజయ్ దత్ పత్రాలు పరిచయం చేశారు. అయితే కాశ్మీర్ లో ఉండే ఓ విజయ్ తన భార్య త్రిష తో కలిసి ఉంటె అక్కడ తనకి తనలాగే ఉండే క్రిమినల్ విజయ్ మూలాన వచ్చే నష్టాలు ఏంటి అనేది కేజ్రీగా అనిపిస్తుంది.

దీనితో ఓ మంచి విజయ్ కి విలన్ విజయ్ మూలాన వచ్చే నష్టం ఏంటి దానిని మంచోడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనే క్రేజీ అంశాలు లోకేష్ ప్రెజెంట్ చేస్టున్నట్టుగా అనిపిస్తుంది. దీనితో అయితే డెఫినెట్ గా విజయ్ వర్సెస్ విజయ్ అనే సరికొత్త పాయింట్ ని లోకేష్ ఓ రేంజ్ లో లేపాడు అని చెప్పొచ్చు.

అంతే కాకుండా ఏక్షన్ సీక్వెన్స్ లు కూడా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. మరి అనుకున్న అంచనాలు అందుకునేలానే ఈ ట్రైలర్ చూసాక అనిపిస్తుంది. మరి రిలీజ్ అయ్యాక మాత్రం విజయ్ కెరీర్ లో భారీ హిట్ అవుతుందో లేదో చూడాలి మరి.
LEO - Official Trailer (Telugu) | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh Ravichander