వామ్మో.. తేజ సజ్జా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడా.?

ఒక్క సినిమా హిట్టయితే, ఆ హీరో దశ తిరిగినట్టే.! నిజానికి, ‘హనుమాన్’ సినిమా కంటే మందే, తేజ సజ్జ రేంజ్ పెరిగిపోయింది. కాకపోతే, దాన్ని ఎవరూ అంగీకరించలేదు. సినిమా నిర్మాణ సమయంలో ఓ చిన్న నిర్మాత, తేజ సజ్జతో సినిమా కోసం ప్రయత్నిస్తే, ‘నేను పాన్ ఇండియా హీరోని’ అన్నాడట.

నిజమో కాదోగానీ, అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. తేజ సజ్జ నిజంగానే పాన్ ఇండియా హిట్టు కొట్టాడు. పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు కూడా. ఏకంగా వంద కోట్ల క్లబ్బులో చేరిపోయాడు (షేర్ పరంగా).!

సో, ఇప్పుడు తేజ సజ్జని పట్టుకోవడం అంత తేలిక కాదు ఏ దర్శకుడికైనా, ఏ నిర్మాతకైనా.! జెయింట్ కిల్లర్ అనడం అతిశయోక్తి కాదేమో తేజ సజ్జా విషయంలో. నిజమే మరి, ‘గుంటూరు కారం’ సినిమాని దారుణంగా దెబ్బ తీశాడు ‘హనుమాన్’.!

తేజ సజ్జా చేతిలో ‘జై హనుమాన్’ వుంది. ఇకనేం, రెమ్యునరేషన్ ఖచ్చితంగా రెండింతలు మూడింతలు కాదు, పదింతలు అయ్యే అవకాశం వుంది. అది కాకుండా వేరే సినిమా అంటే, అది మళ్ళీ వేరే లెవల్.

కానీ, అంత రెమ్యునరేషన్ తేజ సజ్జాకి ఇస్తే, నిర్మాతకి వర్కవుట్ అవుతుందా.? ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవదు కదా.! ఇక్కడే తేజ సజ్జా జాగ్రత్త పడాలి. పడతాడేమో కూడా.! ఎందుకంటే, ఓవర్ నైట్ స్టార్లుగా మారిన చాలామందిని సినీ పరిశ్రమ చూసేసింది.

‘అబ్బే, నేనలాంటి టైపు కాదు..’ అని తేజ సజ్జ ఆల్రెడీ తనకు అత్యంత సన్నిహితులైన బడా నిర్మాతలతో తన మీద వస్తున్న గాసిప్స్ మీద వివరణ ఇచ్చుకుంటున్నాడట.