నాకు ఆహ్వానం అందలేదు.. సీఎంతో సినీ ప్రముఖుల మీటింగ్ పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్!

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన టాలీవుడ్ మొత్తాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఆ సంఘటన వలన జరిగిన పరిణామాలు ఇండస్ట్రీ మొత్తం ఫేస్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇకపై బెనిఫిట్ షోలకి అనుమతి ఉండదని, టికెట్ల రేట్లు పెంపు ఉండబోదని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో సినీ పెద్దలు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఈ భేటీ పై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చారు. అది ప్రభుత్వం పిలిచి ఏర్పాటు చేసిన మీటింగు కాదు ఈ మీటింగ్ కి తనకి ఆహ్వానం అందలేదని చెప్పారు.ఇండస్ట్రీ అంటే చాంబర్ ఒకటే కాదని అన్ని సెక్టార్లను కలిపితేనే ఇండస్ట్రీ అని చెప్పుకొచ్చారు. పిఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజుని పిలవడంతో ఆయన కొంతమందిని మాత్రమే తీసుకు వెళ్ళారని, సినిమాలు తీసే నిర్మాతలు వాటి పరిష్కారం కోసం వెళ్లారని అంతేకాకుండా బెనిఫిట్ షోస్ వద్దని ముందే చెప్పానని చెప్పారు తమ్మారెడ్డి.

అందర్నీ సమన్వయపరచడానికి ఫిలిం చాంబర్ ఉంది. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందని అపోహ నిన్నటి మీటింగ్ తో తొలగిపోయింది. అది బెస్ట్ మీటింగ్ అని అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాతో చెప్పారు. గతంలో మేము కూడా కొన్ని బెనిఫిట్ షోలు వేసాము కానీ అవి ఉచితంగా ప్రదర్శించాము, అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది, దీని గురించి ప్రేక్షకులు నిర్మాతలు కూడా ఆలోచించాలి. తాజాగా జరిగిన మీటింగ్లో వాళ్లు సినిమాలు గురించి మాట్లాడలేదు.

ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహాయం కోరటానికి వెళ్లారు. ఇకపోతే అల్లు అర్జున్,సుకుమార్ గతంలో మంచి సందేశాన్ని ఇచ్చే షార్ట్ ఫిలిమ్స్ చేశారని ఎన్టీఆర్, చిరంజీవి కూడా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ లలో నటించారని గుర్తు చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు సినిమా వాళ్ళ నుంచి కచ్చితంగా మద్దతు ఉంటుందని, కేవలం సినిమా రిలీజ్ సమయంలోనే కాకుండా అవసరమైనప్పుడు ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.