2024 సంక్రాంతి రేస్ లో తమిళ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా..!

సినిమాలకి అతి పెద్ద ఏదన్నా ఉంది అంటే అదే సంక్రాంతి రేస్ అనే చెప్పాలి ఈ టైం లో వచ్చిన ఓ సినిమా హిట్ టక తెచ్చుకుంది అంటే దానిని ఆపడం ఎవరి తరం కాదు అలుపొచ్చి బాక్సాఫీస్ దగ్గర అదే ఆగాలి తప్ప ఆడియెన్స్ సినిమాని అలా చూస్తూనే ఉంటారు. మరి అలా ఈ ఏడాది వచ్చిన చిత్రం సంక్రాంతి విన్నర్ గా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నిలిచింది.

కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి అయితే భారీ పోటీ నెలకొనగా ఈ పోటీలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ లు రేస్ లో ఉన్నాయి. మెయిన్ గా సౌత్ ఇండియా మార్కెట్ లో సంక్రాంతి రేస్ చాలా కీలకం కాగా ఈ బరిలో అయితే తెలుగు నుంచి ఆల్రెడీ భారీ సినిమాలు ఉండగా ఇపుడు తమిళ్ నుంచి ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ వచ్చింది.

యంగ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వెర్సటైల్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కిస్తున్న ఆ చిత్రమే “అయలాన్”. ఇండియన్ సినిమా దగ్గర అసలు ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలే చాలా తక్కువ మరి అందులో ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ ఏలియన్ సినిమా కాగా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇండియన్ సినిమా నుంచి భారీ విజువల్స్ ఉన్న సినిమాగా ఇది వస్తుండగా మేకర్స్ అయితే ఈ సినిమాని నిజానికి ఈ దీపావళికి విడుదల చేయాల్సి ఉంది కానీ దీనిని ఇపుడు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా శివ కార్తికేయన్ అయితే అప్డేట్ అందించాడు. మరి సినిమా కానీ అనుకున్న అంచనాలు రీచ్ ఐతే మాత్రం సంక్రాంతికి గట్టి పోటీనే ఇస్తుంది అని చెప్పడంలో డౌట్ లేదు. 
https://x.com/Siva_Kartikeyan/status/1705530537052635434?s=20