చిత్రపరిశ్రమలో ఈ ఏడాది పెళ్లి బాజాలు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా..
తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది. ‘గుడ్‌నైట్’ తో విజయాన్ని అందుకున్న కోలీవుడ్ భామ మీతా రఘునాథ్. రొమాంటిక్ కామెడీగా రూపొందించిన ఈ చిత్రంలో ఆమె నటనకు సినీ ప్రియులు మనసు పారేసుకున్నారు. ఆమె వివాహబంధంలోకి అడుగుపెట్టారు. జీవిత భాగస్వామితో కలిసి దిగిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
‘నా హృదయం’ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన భర్త పేరేంటి? వివాహం ఎప్పుడు జరిగింది? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. మీతా సొంతూరు ఊటీలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగినట్లు సమాచారం. మరోవైపు, ‘గుడ్‌నైట్’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె జె.ఎఫ్.డబ్ల్యూ మూవీ అవార్డును సొంతం చేసుకున్నారు.