విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లిప్‌లాక్‌కు సై అంటున్న త‌మ‌న్నా.. పార్టీ మార్చింది అంటూ కామెంట్స్

యూత్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.త‌క్కువ టైంలోనే ల‌క్ష‌లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న విజ‌య్ సెల‌బ్రిటీల మ‌న‌సుల‌ని సైతం దోచుకున్నాడు. మ‌న తెలుగు హీరోయిన్సే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఆయ‌న ప్రేమ‌కు ఫిదా అవుతున్నారు. కియారా అద్వానీ, జాన్వీ క‌పూర్ లాంటి వారు విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే చాలా ఇష్టం అని ప‌లు మార్లు చెప్పుకొచ్చారు.

టాలీవుడ్‌లో స‌మంత నుండి నిధి అగ‌ర్వాల్ వ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఇష్ట‌ప‌డుతుండ‌గా, ఇప్పుడు ఈ లిస్ట్‌లో త‌మ‌న్నా కూడా చేరింది. రీసెంట్‌గా సామ్ జామ్ షోకు గెస్ట్‌గా వ‌చ్చిన స‌మంత త‌న మ‌న‌సులో భావాల‌ని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా ఏ హీరోతో ముద్దు పంచుకుంటార‌ని అని త‌మ‌న్నాని స‌మంత ప్ర‌శ్నించ‌గా, ఇందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ అని చెప్పింది. 15 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు లిప్ లాక్ సీన్ లు చేయ‌ల‌ని త‌మ‌న్నా ఇప్పుడు కాస్త బోల్డ్ గానే మాట్లాడుతుంది అంటే రానున్న రోజుల‌లో ఈ అమ్మ‌డు లిప్ లాక్ కి సై అంటుందేమోన‌ని అనుమానాలు వ‌స్తున్నాయి.

గ‌తంలో లిప్ లాక్ చేసే ఛాన్స్ వ‌స్తే బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్‌ని కిస్ చేస్తాన‌ని చెప్పిన త‌మ‌న్నా ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు ఎందుకు చెప్పిందా అని ఇండ‌స్ట్రీలో జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ప్ర‌స్తుతం త‌మ‌న్నాకి పెద్ద‌గా ఆఫ‌ర్స్ లేక‌పోయిన త‌న అంద‌చందాల‌తో నెట్టుకొస్తుంది. ఇటీవ‌లి కాలంలో కరోనా జయించిన ఈ బొమ్మ చ‌నిపోతానేమోన‌ని చాలా భ‌యం వేసిందంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది