సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్నా ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకొని తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ్ భాషలలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించిన తమన్నా ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా తమన్న పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ లో అడపాదప సినిమాలు చేస్తూ బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా ఇటీవల ఒక బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ బాలీవుడ్ నటుడు మరెవరో కాదు నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో విలన్ పాత్రలో నటించిన విజయ్ వర్మ. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు పొందిన విజయ్ వర్మతో తమన్న ప్రేమాయణం నడుపుతున్నట్లు సమాచారం.
అంతేకాకుండా న్యూ ఇయర్ సందర్భంగా తమన్నా అతనికి ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. అయితే తాజాగా ఈ పెళ్లి వార్తలపై స్పందించిన విజయవర్మ తమ పెళ్లి గురించి అందరికీ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో విజయవర్మ మాట్లాడుతూ… తమన్నా తో తనకి ఎటువంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా మేమిద్దరం డేటింగ్ చేస్తున్నామంటూ వార్తలు వచ్చాయి. కానీ నేను అసలు లంచ్ డేట్ చేసింది ఇతని తోనే అంటూ డైరెక్టర్ సుజొయ్ గోష్ తో ఉన్న ఒక ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ఇలా తమన్నా తో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని విజయ్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఇకనుండి అయిన ఈ వార్తలకు బ్రేక్ పడుతుందో? లేదో? చూడాలి మరి.